తోట త్రిమూర్తులు పాదయాత్రకు అనూహ్య స్పందన…

మండపేట: వైఎస్సార్సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జి తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. గత వారం రోజులుగా ఆయన పాదయాత్ర ను నిర్వహిస్తున్నారు. నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రను చేపట్టారు. నేటికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పూర్తితో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151 వైఎస్సార్సీపీ శాసనసభ్యులు 24 మంది నియోజకవర్గ ఇన్ చార్జి లు గత వారం రోజులుగా వారివారి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిగిలిపోయిన ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పాదయాత్రలు జరుపుతున్నారు. జిల్లాలో సీనియర్ రాజకీయవేత్త అసెంబ్లీ టైగర్ గా పేరుగాంచిన తోట త్రిమూర్తులు చేపడుతున్న పాదయాత్ర కు మండలాల్లో మహిళలు అడుగడుగునా నీరాజనాలు అర్పిస్తున్నారు.

మండపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక వినూత్నమైన చరిత్ర ఉంది. గతంలో ఆలమూరు నుండి రాష్ట్ర రాజకీయ దిగ్గజం మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు.అదే రీతిలో సంగిత వారసుడిగా తోట త్రిమూర్తులు మండపేట పురపాలక సంఘం, అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయాలని, ఫ్యాన్ గాలి అన్ని గ్రామాల్లో, వాడల్లో చల్లని గాలులు వీయాలని కృతనిశ్చయంతో పాదయాత్ర జరుపుతున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా తోట త్రిమూర్తులు చేపట్టిన పాదయాత్ర అంగరంగ వైభవంగా మారింది. ఆయన మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాడని ప్రత్యేక ఉంది. వైయస్ జగన్ కు అనుంగు శిష్యునిగా ఆయన మండపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజృంభిస్తున్న కరోనా వైరస్ ను సైతం లెక్కచేయకుండా ఆయన రోజుకు పది గంటల పాటు పార్టీ కోసం కష్టపడుతూ పనిచేస్తున్నారు. నియోజకవర్గంలో సామాన్య ప్రజల వద్దకు వెళ్ళి వారి కష్టసుఖాలను పరిశీలించి వారికి సామాజిక న్యాయం చేస్తున్నారు.  తోట చేస్తున్న ఈ పాదయాత్ర రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని నియోజకవర్గంలో రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

-టి.వి.గోవిందరావు

 

1 Comment
  1. Ranjan says

    The great leader in the state Ranjan

Your email address will not be published.