త్వరగా రిలీజ్ చేయండి!: శశికళ రిక్వెస్ట్

బెంగుళూరు: అక్రమ ఆస్తుల కేసులో పరప్పన అగ్రహార జైలు లో శశి కళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తనను తర్వగా విడుదల చేయాలని కోరుతూ శశికళ దరఖాస్తు చేసుకున్నారు. కోర్టు శిక్ష ప్రకారం 2021 జనవరి 27న ఆమె విడుదల కావాలి. తాను చెల్లించిన రూ. 10 కోట్ల జరిమానా, సత్ర్పవర్తన కారణంగా త్వరగా విడుదలయ్యే అవకాశాలను పరిశీలించాలని ఆమె కారాగార అధికారులకు విన్నివించుకున్నారు. సత్ర్పవర్తన కారణంగా ప్రతి నెలా మూడు రోజులు శిక్షా కాలం నుంచి మినహాయిస్తారు. ఇప్పటికే 43 నెలల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న శశికళ 135 రోజుల సత్ర్పవర్తన దినాలను మినహాయిస్తే నిర్దేశిత సమయం కంటే ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉంది. శశికళ దరఖాస్తును కారాగార ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.