త్వరలో బీజేపీలో చేరుతా: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌ : కాగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.