త్వరలో 50 వేల ఉద్యోగాలు: మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నోటిఫికేషన్ విడుదలచేయాలని నిర్ణయించారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఇందుకోసం సిద్దిపేట నిరుద్యోగ యువతీ యువకులకు సాయమందించేందుకు శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు. కరోనాతో చిరువ్యాపారులు, చిన్న ఉద్యోగులు పదినెలలపాటు ఇబ్బందులు పడ్డారని మంత్రి హరీశ్ చెప్పారు. ఆటో డ్రైవర్లు, హమాలీ, రిక్షా, మార్కెట్ వర్కర్లు, నాయీబ్రాహ్మణులు, సఫాయి కార్మికులు ఇలా ఇప్పటి వరకు 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశామని తెలిపారు. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చుకుందామని, ప్రజలు స్వచ్ఛత యాప్‌లో గ్రీవెన్స్లోకి వెళ్లి ఫిర్యాదులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.