తమిళ హీరో సూర్యకు కరోనా

చెన్నై : ప్రముఖ తమిళ హీరో సూర్యకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు. “తాను కరోనాతో బాధపడుతున్నానని, ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నానని, మన జీవితాలు కరోనా నుంచి ఇంకా బయటపడలేదని.. అలాగని భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కరోనా నుండి కోలుకునేందుకు కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను..“ అంటూ సూర్య ట్వీట్ చేశారు.
ప్రస్తుతం ఆయన పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 40వ సినిమాను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. షూటింగ్స్ నిమిత్తం బయటకు వచ్చినప్పుడు కరోనా సోకి వుండవచ్చని భావిస్తున్నారు. కాగా, గత ఏడాది ఒటిటిలో విడుదలైన ఆకాశం నీ హద్దురా (సూరరై పోట్రు) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు. కాగా తనను కలిసిన మిత్రులు అందరూ చెకప్ చేసుకోవాలని కూడా సూర్య సూచించారు.