తల్లి మందలించిందని.. తుపాకీతో కాల్చుకున్న విద్యార్థిని
లక్నో: చదువుకోవాలని తల్లి చెప్పినందుకు ఓ విద్యార్థిని తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. యుపిలోని మోర్దాబాద్ జిల్లాలోని బాజ్‌పూర్ మాన్ గ్రామంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయి (17) చదువును వదిలేసి కాలక్షేపం చేస్తుండటంతో.. ఆమె తల్లి మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి తన గదిలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆమె కాల్చుకున్న తుపాకీకి లైసెన్స్ లేదు. ఈ తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.