థాయిలాండ్‌లో బస్సును ఢీకొట్టిన రైలు

20 మంది మృతి, మ‌రో 30 మంది తీవ్ర‌గాయాలు

బ్యాంకాక్‌ : థాయిలాండ్‌లో ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సును రైలు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బ్యాంకాక్‌ నుంచి చా చోంగ్‌సావో ప్రావిన్స్‌లోని ఓ ఆలయంలో బౌద్ధ ఉత్సవాల ముగింపు వేడుకలకు హాజరయ్యేందు వెళ్తుండగా ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుందని ప్రావిన్స్‌ గవర్నర్‌ మైత్రీ త్రితిలానంద్‌ తెలిపారు. మృతులంతా ఓ ప్యాక్టరీకి చెందిన కార్మికులుగా గుర్తించారు. టూరిస్ట్‌ బస్సు రైల్వే ట్రాక్‌ దాటుతుండగా గూడ్స్ ట్రైన్ ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. రైలు ఢీకొన్న వేగానికి బస్సు నుజ్జునుజ్జయ్యింది. శిథిలాలు, మృతదేహాలు రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ప్ర‌మాద‌న్ని చూసి ప‌లువురు స్థానికులు భ‌‌ధ్ర‌తా సిబ్బందితో క‌లిసి స‌హాయక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

 

Officials and onlookers gather near the wreckage of an overturned bus involved in a deadly collision with a train next to Khlong Kwaeng Klan railway station in Chachoengsao province, east of the Thai capital Bangkok, on October 11, 2020. (Photo by Mladen ANTONOV / AFP)

Leave A Reply

Your email address will not be published.