దాద్రానగర్ ఎంపి మోహన్ దేల్కర్ ఆత్మహత్య
న్యూడిల్లీ: ముంబయిలోని ఓ హోటల్లో దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సూసైడ్(58) చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన మోహన్ 2019లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 58 ఏళ్ల ఎంపి మృతదేహంతో పాటు సూసైడ్ నోట్ కూడా దొరికిందన్న వార్తలపై స్పందించడానికి అధికారులు నిరాకరించారు.