దారుణం: అన్నను, అక్కను చంపిన తమ్ముడు!

శ్రీకాకుంళం: ఆస్తి వివాదంతో తోడ‌బుట్టిన అన్న‌, అక్క‌ను న‌రికిచంపాడో వ్య‌క్తి.. ఈ హ‌త్య‌లు శ్రీ‌కాకుళం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. కొవ్వాడలోని ర‌ణ‌స్థ‌లం మండ‌లం రామచంద్రాపురం గ్రామంలో ఈ జంట హత్యల ఘ‌ట‌న చోటుచేసుకుంది. కొవ్వాడ అణువిద్యుత్‌ కేంద్రం వారు అందించిన నష్టపరిహారం విషయంలో అన్న‌దమ్ముల మ‌ధ్య వివాదం జ‌రిగింది. అన్నాద‌మ్ములైన గొర్లె సన్యాసిరావు, రామకృష్ణ మధ్య మొద‌లైన చిన్న గొడ‌వ ఈ జంట హ‌త్య‌ల‌కు దారి తీసింది. ఇద్ద‌రి మ‌ధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది.

ఎప్ప‌టి లాగే ఆదివారం ఉద‌యం ప‌శువ‌ల పాక‌లో పాలు తీస్తుండ‌గా వెనుక నుంచి వ‌చ్చిన త‌మ్ముడు రామ‌కృష్ణ అన్నను కత్తితో పొడిచి చంపాడు. అడ్డువచ్చిన అక్క జయమ్మను కూడా హతమార్చాడు. ర‌క్త‌పు మ‌డుగులో ఇద్ద‌రు కుప్ప‌కూలిపోయారు. పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.