దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురి హత్య!

లఖ్‌నపూ: యూపీలో దారుణం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులను ఓ వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ సభ్యులంతా రాత్రి నిద్రిస్తున్న సమయంలో నిందితుడు భార్యాభర్తలతో పాటు ముగ్గురు పిల్లలను చంపేశాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా భూవివాదంలో మామ కుటుంబాన్ని అల్లుడు చంపినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.