AP-TS సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా నిలిచిన వాహనాలు

అలంపూర్‌/ సూర్యాపేట (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-తెలంగాణ సరిహద్దులో వాహ‌నాల నిలిపివేత‌తో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. స‌రిహ‌ద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి అంబులెన్స్‌, సరకు రవాణా, అత్యవసర, ఈ-పాస్‌లున్న వాటిని మినహా ఇతర వాహనాలను వేటిని తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. దీంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపూర్‌ చెక్‌పోస్టు, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలంలోని పూల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

క‌ర్ఫ్యూ మిన‌హాయింపు వేళ‌ల్లోనూ ఉద‌యం 6 గంట‌ల నుండి 10 గంట‌ల మ‌ధ్య‌లోనూ అనుమ‌తించ‌క‌పోవ‌డంపై వాహ‌న‌దారులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. క‌ర్ఫ్యూ స‌మ‌యంలో కాకుండా రోజు మాదిరిగానే వెళ్తున్నా ఈ కొత్త ఆంక్ష‌లేంట‌ని మండిప‌డుతున్నారు. కాగా ఈ-పాస్ ఉన్న‌వారినే అనుమ‌తిస్తామంటూ తెలంగాణ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.