దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

హైదరాబాద్ : దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను ఆలయ కమిటీకి అందజేశారు. భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి సాయిబాబా దేవస్థానానికి ఐఎస్‌ఓ సర్టిఫికెట్ రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని బాబాను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ చైర్మన్ శివయ్య, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మెంబర్ డాక్టర్ విజయ రంగ పాల్గొన్నారు.
.@RaoKavitha offered prayers at Saibaba temple, Dilsukhnagar along with MLA @D_SudheerReddy garu and MLC Dayanand garu pic.twitter.com/QIGkC5NJqF
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) December 10, 2020