దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే..
ఆర్థిక మంత్రి హరీష్‌రావు

సిద్దిపేట : దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదే అని హరీష్ రావు స్పష్టం చేశారు. దుబ్బాక ఆర్యవైశ్య భవన్‌లో నిర్వహించిన అలాయ్ – బలాయ్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాకను అభివృద్ధి చేయడంలో ప్రజలకు ఎలాంటి అనుమానం అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తానని తేల్చిచెప్పారు. ఇంతకు ముందు సీఎం ఆశీస్సులతో నారాయణఖేడ్‌ను కూడా అభివృద్ధి చేశానని చెప్పారు. కేలవం బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేవలం ఓట్ల కోసం మాత్రమే వస్తున్నారని తెలిపారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దుబ్బాకు కూడా రాలేదు కానీ ఇప్పుడు ఓట్లడగడానికి మాత్రం వస్తున్నాడు. కేవలం ఎన్నికల వరకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దుబ్బాకలో ఉంటారు. కానీ తాను, సుజాతక్క ఎల్లప్పుడూ దుబ్బాకలోనే ఉండి ప్రజలకు అందుబాటులోనే ఉంటామని మంత్రి తెలిపారు.