దుబ్బాక గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో సంబురాలు

మ‌హేశ్వ‌రం: దుబ్బాక ఉపఎన్నికలో కారు జోరుకు కళ్లెం వేస్తూ బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 1,118 ఓట్ల మెజార్టీతో సంచలన విజయం నమోదు కావడంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబురాల్లో మునిగిపోయారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు. బాణాసంచా కాల్చి, డోలు బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.


మ‌హేశ్వ‌రంలో బిజెపి మిఠాయి పంచిన కార్య‌క‌ర్త‌లు

దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించడంతో మహేశ్వరం నియోజకవ‌ర్గ బీజేపీ కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచారు. విజ‌యం సాధించిన అనంత‌రం మ‌హేశ్వ‌రంలోని విధుల్లో కాషాయ జెండాల‌తో కార్య‌క‌ర్త‌లు విజయోత్స‌వాలు నిర్వ‌హిస్తూ సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి, డోలు బాజాలు మోగించి కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్సులు చేశారు.ఈ వేడుక‌ల్లో రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బోక్కా నర్సింహా రెడ్డి, కిసాన్ మోర్చ పాపయ్య గౌడ్, మహేశ్వరం మండల ఆధ్యక్షులు మాధవ చారి, బిజెవై యం అధ్యక్షులు శ్రావన్, మహేశ్వరం గ్రామ అధ్యక్షులు ఒగ్గు శ్రీశైలం మరియు నియోజక వర్గ సీనియర్ నాయకులు పోతర్ల దర్శన్, మరియు సినియర్ నాయకులు, కార్యకర్తలు, ప‌లువురు ప్ర‌జ‌లు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.