దేశంలో కొత్తగా 13,052 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో 13,052 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే మరో 127 మంది మహమ్మారికి బలయ్యారు. ఈ మేర‌కు ఆదివారం ఉద‌యం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది.తాజాగా వైరస్‌ నుంచి కోలుకొని 13,965 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో 1,07,46,183కు చేరాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 1,04,23,125 మంది కోలుకున్నారని పేర్కొంది. వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి సంఖ్య 1,54,274కు పెరిగిందని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 1,68,784 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.