దేశంలో కొత్తగా 26,291 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 26,291 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే తాజాగా 118 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,13,85,339గా ఉండగా, మరణాలు 1,58,725కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 1,10,07,352 మంది బాధితులు మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2,19,262 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా గత 24 గంట వ్యవధిలో 17,455 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్రం తెలిపింది.