దేశంలో కొత్తగా 13,788 కరోనా కేసులు
హైదరాబాద్: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,788 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 145 మంది కరోనాబారినపడి మృతిచెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తాజా కరోనా బులెటిన్ విడుదల చేసింది. అలాగే 14,457 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు సంఖ్య 1,05,71,773కు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 1,02,11,342 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,52,419కు చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,08,012 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొంది.