దేశంలో కొత్త‌గా 24,492 క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,492 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 114,09,831 క‌రోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,10,27,543 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,23,432 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 131 మంది మృతి చెందారు. ఇప్ప‌టి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,58, 856కి చేరింది. ఇండియాలో కొత్త‌గా 20,191 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు కరోనా బులెటిన్ లో తెలిపారు. కాగా దేశంలో న‌మోద‌వుతున్న కేసుల్లో ఎక్కువ భాగం మ‌హారాష్ట్ర నుంచే న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం.

Leave A Reply

Your email address will not be published.