దేశంలో త‌గ్గుముఖం ప‌డుతున్న కేసులు.. మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ (CLiC2NEWS):దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ ఉధృతి తగ్గుముఖం పడుతున్నది. వరుసగా మూడు రోజు రెండు లక్షలకు దిగువన నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్త‌గా 1,65,553 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది.

తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,78,94,800కు చేరింది. తాజాగా  2,76,309 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం  2,54,54,320 మంది కోలుకున్నారు. గ‌డిచిన  24 గంటల్లో 3,460 మంది మృత్యువాతపడ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో వైరస్‌ బారినపడి మొత్తం 3,25,972 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,14,508 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.