దిగొచ్చిన పసిడి

ముంబ‌యి: ప‌సిడి ప్రియుల‌కుశుభవార్త‌. ఈ మాధ్య కాలంలో బంగారం ధరలు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన ప‌సిడి రేట్లు బుధవారం కొంత వ‌ర‌కు దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు తగ్గడంతో దేశీ మార్కెట్‌లోనూ యల్లో మెటల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 409 రూపాయలు తగ్గి 50,272 రూపాయలకు పడిపోగా, కిలో వెండి ఏకంగా 1700 రూపాయలు పతనమై 60,765 రూపాయలు పలికింది. గతనెలలో బంగారం ఆల్‌టైమ్‌ హై తాకినప్పటి నుంచి ఇప్పటివరకూ 6000 రూపాయలు దిగివచ్చింది. ఇక డాలర్‌ బలపడటం, అమెరికాలో మరో ఉద్దీపన ప్యాకేజ్‌ ప్రకటించవచ్చనే సంకేతాలతో గ్లోబల్‌ మార్కెట్‌లో గోల్డ్‌ ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్‌గోల్డ్‌ 0.1 శాతం తగ్గి ఔన్స్‌ 1896 డాలర్లకు పడిపోయింది. బంగారం, వెండి ధరలు మరికొద్ది రోజులు ఒడిదుడుకులతో సాగవచ్చని బులియన్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.