ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూత

విశాఖ: మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత ద్రోణంరాజు శ్రీనివాస్‌ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పినాకిల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన విశాఖ వన్‌టౌన్‌ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విశాఖ మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా ఉన్నారు. ద్రోణంరాజు శ్రీనివాస్‌ గత నెలరోజులుగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స అనంతరం కోలుకున్నప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్‌లోనే చికిత్స పొందారు. ఆదివారం మధ్యాహ్నం ద్రోణంరాజు శ్రీనివాస్‌ ను రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పరామర్శించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆశించారు. కొద్దిసేపటి క్రితమే ద్రోణంరాజు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన మృతి చెందినట్లు అధికార ప్రకటన చేశారు.

Leave A Reply

Your email address will not be published.