దమ్ముంటే రాజీనామా చేయ్..
ఈటల రాజేందర్‌కు మంత్రి గంగుల సవాల్
కరీంనగర్ (CLiC2NEWS): ఈటల రాజేందర్‌కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి రావాలని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు. కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ ప్రజలు ఈటల వెంట ఎందుకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయట్లేదు అని ప్రశ్నించారు. కరీంనగర్‌ను బొందలగడ్డగా మార్చినట్లు తనపై విమర్శలు చేయడం సరికాదు. హుజురాబాద్ నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమలు నడుస్తున్నాయి.
అసైన్డ్ భూములు విషయంలో ఈటలను దోషిగా తేల్చారని.. వెంటనే వాటిని తిరిగి ఇచ్చేయాలని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెరాసలో ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామని వెల్లడించారు. కరీంనగర్‌లో నేను గెలవకూడదని ఈటల శతవిధాలా ప్రయత్నించారని ఆరోపించారు.
పన్నులు ఎగ్గొట్టానని నాపై విమర్శలు చేయడం తగదన్నారు. ఎక్కడైనా పన్నులు ఎగ్గొట్టినట్లు నిరూపిస్తే ఐదు రెట్లు అధికంగా చెల్లిస్తానని తెలిపారు. అసైన్డ్ భూముల విషయంలో ఈటలను దోషిగా తేల్చారని… ఆయన ఆధీనంలోని అసైన్డ్ భూములను తిరిగి ఇచ్చేయాలని సూచించారు. ఈటల బెదిరింపులకు ఎవరూ భయపడరు. తాను కూడా బీసీ బిడ్డనే.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. ఈటల కంటే తనకు ఆత్మగౌరవం ఎక్కువ అని మంత్రి గంగుల పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందునే ఇన్నాళ్లూ ఈటలను గౌరవించామన్నారు. కార్యకర్తలను ఈటల కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈటల ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.