ధర్మపురిలో వైభవంగా కార్తీక దీపోత్సవం..

ధర్మపురి : కార్తీక పౌర్ణమి సందర్భంగా నవ నారసింహక్షేత్రాలలో ఒక్కటైన ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి ఇవాళ ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. కోనేరులో పంచసహస్ర దీపాలంకరణ కార్యక్రమాన్ని సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు బొజ్జ రమేశ్‌శర్మ తదితర వేదబ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య ఆలయ ఉప ప్రధాన అర్చకులు నంబి శ్రీనివాసాచారి బ్రహ్మపుష్కరిణి మధ్య గల బోగమండపంలో లక్ష్మీనరసింహస్వామివారి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజానంతరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ దావా వసంత, కలెక్టర్ రవి, అడిషనల్ కలెక్టర్ రాజేశం, ఈవో శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలంకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళలు బ్రహ్మపుష్కరిణి చుట్టూ దీపాలను వెలిగించారు. దీపకాంతులతో పుష్కరిణి శోభిల్లింది.