ధ‌ర‌లు పెంచిన రెనాల్ట్‌ ట్రైబర్‌ ఇండియా

ముంబ‌యి: రెనాల్ట్‌ ఇండియా తన పాపులర్‌ ఎంపివి ట్రైబర్‌ ధరలను మరోసారి ధర పెంపుతో రూ.11,500 నుండి రూ.13,000 మేర పెంచేసింది. గత ఏడాది ఆగస్టులో భారత మార్కెట్‌ లో రెనాల్ట్‌ ట్రైబర్‌ లాంచ్‌ చేసింది. ఆ తరువాత కొత్త నిబంధనలకు అనుగుణంగా అప్‌ డేట్‌ చేసి బీఎస్‌-6 వేరియంట్‌ ట్రైబర్‌ను 4.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ఈ ఏడాది జనవరిలో తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 29 వేల రూపాయల మేర ధర పెంచింది. తాజాగా మరోసారి ధర పెంపుతో రూ.11,500 నుండి రూ.13,000 మేర వినియోగదారులపై భారం మోపనుంది. దేశంలో రెనాల్ట్‌ ట్రైబర్‌ ప్రారంభ ధర రూ.5.12 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉండనుంది. ఈ కారును లాంచ్‌ చేసినప్పటినుంచి ఇప్పటికి నాలుగు సార్లు ధరను పెంచడం గమనార్హం. ప్రధానంగా ఆర్‌ఎక్స్‌ఈ మోడల్‌ ధరను 13 వేల రూపాయలు పెంచింది. దీంతో దీని ధర ఇప్పుడు రూ.5.12 లక్షలుగా ఉంది. రూ.12,500 పెంపుతో ఆర్‌ఎక్స్‌ జెడ్‌, ఆఎక్స్‌ జెడ్‌ ఏఏంటీ వేరియంట్‌ ధరలు 6.94 లక్షలు, 7.34 లక్షలు (అన్ని ధరలు ఎక్స్‌-షోరూమ్‌) రూపాయలు. రెనాల్ట్‌ ట్రైబర్‌ ఎంపీవీ సింగిల్‌ పవర్‌ ట్రెయిన్‌ ఆప్షన్‌తో వస్తుంది.

Leave A Reply

Your email address will not be published.