నర్సాన్నా… మళ్లీ రావా!

ఓ మీసాల సూర్యుడా!
ఓ బుల్లెట్ వీరుడా!
కూలి,నాలి వర్గానికి పెద్ద దిక్కు నీవు
కార్మిక లోకానికి అండదండవు నీవు
నీ మరణ వార్త విని
వీఎస్టీ చిన్నబోయింది
ముషీరాబాద్ మూగ బోయింది
పలు కంపెనీల కార్మికులు కన్నీరు,మున్నీరవుతున్నారు
నర్సన్నా మళ్ళీ నీవు రావా
మా పీడిత,తాడిత జనానికి రక్షకుడిగా నిలువవా!!
-ఎస్. వి రమణా చార్య
సీనియర్ జర్నలిస్టు