నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

పెద్దఅడిశ‌ర్లపల్లి: నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. గురువారం సాయంత్రం పెద్దఅడిశ‌ర్లపల్లి మండలం అంగడిపేట వద్ద అదుపుత‌ప్పిన లారీ ఎదురుగా వ‌స్తున్న‌ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘ‌టనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. మృతులను చింతబావి గ్రామానికి చెందిన రోజువారీ కూలీలుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.