నాగర్ కర్నూల్‌లో దారుణం: తల్లిని చంపిన తనయుడు

నాగర్‌కర్నూల్ : జిల్లాలోని నాగర్‌కర్నూల్ మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుడిపల్లి గ్రామంలో మద్యం మత్తులో తల్లిని కొడుకు కడతేర్చాడు. నిందితుడు శుభాకర్(22) మద్యం మత్తులో తల్లి ఇస్తారమ్మ తల పగలగొట్టి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.