నాలాలో పడి వృద్ధురాలు మృతి

హైదరాబాద్: మార్నింగ్ వాకింగ్ వెళ్లిన వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో మంగళవారం జరిగింది. శారదానగర్‌కు చెందిన సరోజ (80) తెల్లవారు జామున ఉదయం ఆరు గంటల సమయంలో మార్నింగ్‌ వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది.. ప్రమాదవశాత్తు సరూర్‌నగర్‌ చెరువు కింద నాలాలో పడి కొట్టుకుపోయింది. వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలు ఎంతకూ రాకపోవడంతో, వెతకడానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు హనుమాన్‌ నగర్‌ నాలా వద్ద శవమై కనిపించింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి హుటాహుటిన డీఆర్‌ఎఫ్‌ టీఎంను, పోలీసులు, సీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలు చేపటగా చైతన్యపురిలోని హనుమాన్ నగర్‌లో నాలాలో మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Your email address will not be published.