నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడి
బూర్గంపహాడ్: ఎన్ని కొత్త చట్టాలు వచ్చినా మృగాళ్ల ఆకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక భాస్కర్నగర్ ఎస్టీ కాలనీలో మధ్యాహ్నం అభంశుభం తెలియని నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి జరిగింది.
ఎస్ఐ బమ్మెర బాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్నగర్ కాలనీలోని ఎస్టీ కాలనీకి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారి చాకెట్లు కొనుక్కునేందుకు ఇంటి సమీపంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. దుకాణ సమీపంలో నివాసం ఉండే ఆటోడ్రైవర్ పింగళి గణేశ్ అలియాస్ చింటూ చిన్నారికి చాక్లెట్లు ఇస్తానని ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్లిన తరువాత చిన్నారి విషయాన్ని తల్లికి చెప్పడంతో తల్లిదండ్రులు, స్థానికులతో కలిసి యువకుడి ఇంటికి వెళ్లి అతడిని చితకబాది పోలీసుస్టేషన్లో అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.