నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం

నిజామాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత కల‍్వకుంట్ల ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అధికారికంగా అందచేయనున్నారు. టీఆర్‌ఎస్ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.
ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ ముగిసే సరికి 600 ఓట్లకుగాను టీఆర్ఎస్‌కు 542 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్‌లో పోలైనా రెండు ఓట్లు టీఆర్ఎస్‌కే వచ్చాయి. మిగిలిన 221 ఓట్లను రెండోరౌండ్‌లో లెక్కించనున్నారు. మరికొద్దిసేపట్లో పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి అక్టోబర్ 9న పోలింగ్ జరిగింది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, 823 మంది ప్రజాప్రతినిథులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒక ఓటరు మరణించగా, కరోనా కారణంగా ఇద్దరు ప్రజాప్రతినిథులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటేశారు.
మొత్తం 823 ఓట్లు..
- టీఆర్ఎస్‌కు 728 ఓట్లు
- బీజేపీకి 56 ఓట్లు
- కాంగ్రెస్‌కు 29 ఓట్లు..
- చెల్లని ఓట్లు 10
[…] నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవ… […]