నిరసనలకు దిగితే కొలువులు బంద్!

పాట్నా: ఇకపై బిహార్ రాష్ట్రంలో హింసాత్మక నిరసనలకు దిగడం, రహదారుల దిగ్భందానికి పాల్పడటం, ధర్నాల్లో కూర్చోవడం వంటి చర్యలకు పాల్పడిన వారికి సర్కార్ కొలువులు రావని, వారికి ఎలాంటి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కవనీ పోలీసులు వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. నిరసనల్లో హింసచెలరేగితే ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారి సర్టిఫికెట్లు, ప్రవర్తన ధ్రువీకరణ పత్రాల్లో రిమార్క్ రాస్తారని బిహార్ డీజీపీ ఎస్కే సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్వర్వులపై విపక్షాలు మండిపడ్డాయి.