నిలిచిపోయిన మెట్రో ట్రైన్‌!

హైదరాబాద్‌: అమీర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్‌ బస్‌స్టేషన్‌ వెళ్తుండగా, మార్గమధ్యంలో 15 నిమిషాలపాటు మెట్రోరైలు నిలిచిపోయింది. సాంకేతిక సమస్య తలెత్తడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆగిపోయిన ట్రైన్‌ను తీసుకువచ్చేందుకు అధికారులు మరో ట్రైన్‌ను పంపారు. మెట్రో సిబ్బంది హైటెక్ సిటీ నుంచి జూబ్లీహిల్స్ వరకు వచ్చిన ట్రైన్‌లో ప్యాసింజర్లను దింపేశారు. అయితే గతంలోనూ మెట్రో రైళ్లలో పలుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి.

Leave A Reply

Your email address will not be published.