నీటిలో పడిపోయిన మిత్రున్ని కాపాడిన మూడేళ్ల బాలుడు
రియో డిజనీరో: మూడేళ్ల వయస్సులోనే ఒక బాలుడు రియల్ హీరో అయ్యాడు.. నీటిలో మునిగిపోతున్న తన మిత్రుడిని కాపాడి మంచి సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. ఇప్పుడు ఆ వీడియో ప్రపంచవ్యాప్తంగా నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ మూడేళ్ల చిన్నారి తల్లి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఘటన బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో చోటు చేసుకుంది.
తన కొడుకు ఆర్థర్, తన స్నేహితుడు ఆడుకుంటూ ఉంటుండగా ప్రమాదవశాత్తు బాలుడు నీటిలో పడిపోయినట్లు తెలిపింది. నీటి వద్ద పల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి ఆర్థర్ తల్లి వీడియో షేర్ చేస్తూ పేర్కొన్నారు.
ఈ వీడియోలో… స్విమ్మింగ్ వద్ద రింగ్‌ను అందుకోవడం కోసం అర్ధర్, అతని స్నేహితుడు ఇద్దరు యత్నించారు. ఈ క్రమంలో ఆర్థర్ స్నేహితుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. దీంతో ఆర్థర్ పెద్దవాళ్లను పిలవడమే కాకుండా తన స్నేహితుడిని కూడా కాపాడాడు. ఈ ఘటనలన్ని అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇంకే ముంది మన నెట్ ప్రియులు ఈ వీడియోని ఆకాశికెత్తారు.ఆర్థర్‌ను రియల్ హీరో అంటూ హోరెత్తించారు. ఇక చూసిన పోలీసు ఆర్థర్‌కు ఒక పెద్ద బ్యాగు నిండా చాక్లెట్లతో పాటు మంచి బహుమతిని కూడా అందించారు.
నీటిలో పడిపోయిన చిన్నారిని కాపాడిన మూడేళ్ల బాలుడు