నెల్లూరు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా..

నెల్లూరు: ఏపీలోని నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కావలి మండలం గౌరవరం వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. చెన్నై నుంచి కోల్‌కతాకు కూలీలతో వెళ్తున్న బస్సులో మొత్తం పదిమంది కూలీలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.