నేటి నుంచి యాదాద్రిలో శ్రీలక్ష్మినరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
యాదాద్రి: ఇవాళ్టి నుంచి శ్రీలక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈ నెల 25న ముగుస్తాయి. 16న ధ్వజారోహణం, 21న స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం, 22న ఉదయం 11 గంటలలకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. స్వయంభూ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నందున కరోనా నిబంధనలను పాటిస్తూ బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు.