నేటి నుంచి శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ద‌ర్శ‌నం ప్రారంభం

తిరువ‌నంత‌పురం: కేర‌ళ‌లోని ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం శ‌బ‌రిమ‌ల ఆల‌యంలో భ‌క్తుల కోలాహ‌లం మొద‌లైంది. నేటి నుంచి భ‌క్తుల‌కు అయ్య‌ప్ప ద‌ర్శ‌నానికి అనుమ‌తించారు. కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. కఠిన ఆంక్షల మధ్య రోజుకు వెయ్యి మంది భ‌క్తులు మాత్ర‌మే ఆల‌యంలోకి అనుమ‌తిస్తున్నారు. వారాంతాల్లో 2వేల మందిని అయ్యప్పస్వామి దర్శనానికి అనుమతించనున్నట్లు ఆలయవర్గాలు తెలిపాయి. డిసెంబర్​ 26 వరకు ఆలయాన్ని తెరిచే ఉంచనున్నారు. ఈ క్రమంలో ఆలయ ప్రధాన పూజరి ఏకే సుధీర్ నంబూత్రి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు. భక్తులందరికీ కరోనా టెస్టు నిర్వహించనుండగా 60ఏళ్లు పైబడిన, పదేళ్లలోపు పిల్లలకు అనుమతి లేదు. దగ్గు, జలుబు ఉన్నవారు, ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నవారు కూడా దర్శనానికి రావొద్దని శబరిమల ఆలయ మండలి సూచించింది.

మార్గదర్శకాలివే..

  • అయ్యప్ప దర్శనం చేసుకోవాలనుకున్న భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం “https://sabarimalaonline.org” వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • రోజుకు గరిష్ఠంగా 1,000 మంది భక్తులకు అనుమతి ఇస్తారు. వారాంతాల్లో 2000 మందికి దర్శన భాగ్యం కలిపిస్తారు.
  • శబరిమలకు వచ్చే భక్తులంతా 24 గంటల ముందు కరోనా టెస్టులు చేయించుకోవాలి. వైద్య ఫలితాల్లో నెగటివ్​ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి.
  • రాకపోకల సమయాల్లోనూ భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందే. ప్రతి 30 నిమిషాలకు శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • మాస్కులు తప్పనిసరిగా దరించాలి.
  • స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు సహా సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.
  • ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌ టెస్టులు నిర్వహిస్తారు. వాటిల్లోనూ నెగెటివ్​ వస్తేనే దర్శనానికి అనుమతిస్తారు
  • ఈ మధ్యకాలంలో కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తులు ఉంటే వారికి ఫిట్​నెస్​ టెస్టు చేస్తారు. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, లక్షణాలు లేకుండా ఫిట్​గా ఉన్నారని కన్ఫామ్ చేశాకే ఆలయంలోకి అనుమతి ఇస్తారు.
  • 60-65 సంవత్సరాలు దాటిన వారిని, పది సంవత్సరాలలోపు వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు శబరిమల యాత్రకు రాకూడదని ఆలయ అధికారులు కోరారు.
  • యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కోవిడ్ సోకితే.. వారి కోసం చికిత్స కోసం సదుపాయాలు కల్పిస్తున్నారు.
Leave A Reply

Your email address will not be published.