నేడు ఇందిరాగాంధీ 103వ జయంతి

హైదరాబాద్: మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 103వ జయంతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్య నాయకులు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో చిత్రపటానికి పూల మాలలువేసి నివాళులు అర్పించనున్నారు.