“నేను బాగున్నాను”..

ట్విట్ట‌ర్‌లో ట్రంప్ తాజా వీడియో

వాషింగ్టన్: కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి వచ్చే 48 గంటలూ చాలా కీలకమని వార్తలు అబ‌ద్ధ‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ వార్త‌లు వెలువడిన కొన్ని గంటలకే ట్రంప్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. శనివారం రాత్రి విడుదలైన ఈ వీడియోలో “తాను చాలా బాగున్నానని… అయితే, రాబోయే కొన్నిరోజులు తనకు నిజమైన పరీక్ష” అని ట్రంప్ అన్నారు. కాగా, ట్రంప్ వైద్యుల సూచన మేరకు వైట్‌హౌస్ నుంచి వాల్టర్‌ రీడ్‌ నేషనల్‌ మిలటరీ మెడికల్‌ సెంటర్‌లో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్న ట్రంప్‌పై… ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వచ్చే 48 గంటలూ చాలా సంక్లిష్టమని వాల్టర్‌ రీడ్‌లో ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన ఓ వ్యక్తి మీడియాతో అన్నారు. ఈ సమాచారంతో అమెరికాలో ఆందోళన తారస్థాయికి చేరింది. దీనిపై స్పందించిన ట్రంప్ శనివారం రాత్రి ట్విట్టర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. “నేను ఇప్పుడు చాలా బాగున్నాను, కరోనా నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాను. ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేస్తాను. రాబోయే రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. తదుపరి కొన్నిరోజులు నాకు నిజమైన పరీక్ష” అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఆందోళనకరంగా ట్రంప్‌ ఆరోగ్యం..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు ఆ దేశ అధ్యక్షుడు..అభ్యర్థి..డొనాల్డ్‌ ట్రంప్‌ కరోనా బారిన పడటం పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. అయితే ఆయన పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని సమాచారం. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని తెలుస్తోంది. కరోనా వైరస్‌ శరీరంలోని కొన్ని అవయవాలపౖౖె తీవ్ర ప్రభావం చూపినట్లు సన్నిహితులు చెబుతున్నారు. ట్రంప్‌ ఆసుపత్రిలో చేరిన తర్వాత గుండె, మూత్ర పిండాలు, కాలేయం పనితీరు మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని, ఇతర అనారోగ్య సమస్యలేమీ లేవని వైద్యులు చెప్పారు. ట్రంప్‌కు తొలుత వైట్‌హౌస్‌లో ఉండి చికిత్స పొందినా ఆ తర్వాత అస్వస్థతకు గురికావడంతో ప్రత్యేక హెలికాఫ్టర్‌లో వాల్డర్‌ రీడ్‌ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎన్ని రోజులకు మెరుగుపడుతుందని వైద్యులు చెప్పేంత వరకు వేచి చూడాలని పలువురు భావిస్తున్నారు. కాగా, తాను క్షేమంగానే ఉన్నానని ట్విట్టర్‌లో చిన్న వీడియోను ట్రంప్‌ పోస్ట్‌ చేశారు. ఆసుపత్రిలోని అధ్యక్ష కార్యాలయం నుండే ట్రంప్‌ కొన్ని రోజుల పాటు విధులు నిర్వరిస్తారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆయననకు రెమ్‌డెసివిర్‌తో పాటు యాంటీబాడీ ఔషధాలను ఇస్తున్నారు. మెలీనియా కూడా స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు.

 

Leave A Reply

Your email address will not be published.