షేక్.బహర్ అలీ: నేల మీద పడుకుంటే నొప్పులు మాయం..

మెడ నొప్పి, నడుము నొప్పి, సయాటికా, మోకాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు, అన్ని కూడా నేల మీద 6 నెలలు పడుకుంటే అన్ని 80 శాతం వరకు తగ్గుతాయి. ఇది నేను స్వయాన చేసి తగ్గించుకున్నాను. నేను ఖమ్మం నుండి పాల్వంచకు బైక్ మీద పోవటం, రావటం 200 కిలోమీటర్లు ప్రయాణం రెండు ఏండ్ల నుండి చేస్తున్నాను. దీని వలన మెడ నరాలు బలహీనపడినాయి, మెడ నొప్పి, నడుము నొప్పి, లెఫ్ట్ లెగ్ సయాటికా, మడిమలు నొప్పి, చాలా గోరంగా బాధపడినాను. ఆసనాలు చేయలేకపోయినాను, నేను వెంటనే మమత మెడికల్ హాస్పిటల్ ఖమ్మంలో x Ray తీయించినాను. దానిలో మెడ నరాలు క్లచ్ నొక్కటం వలన అరిగినవి, ఎక్కువసేపు బైక్ మీద కూర్చోవటం వలన వెన్నుపూసల మధ్య అరుగుదల స్టార్ట్ ఐ గ్యాప్ వచ్చింది. బైక్ ఎడమ కాలితో గేర్ లు మార్చటం వలన సయాటికా వచ్చింది. దీనికి ఆసనాలు వేసిన కొంత సేపు రిలాక్స్ గా ఉంటుంది. తరువాత మాములుగా నొప్పి వస్తుంది. ఈ బాధ తట్టుకోలేక కింద పడుకోవడం ప్రారంభించాను, 2 నెలలో అన్ని నొప్పులు 90 శాతం తగ్గినాయి. దయచేసి ఆసనాలు చేసే ప్రతి ఒక్కరు కూడా కింద పడుకోవడం ఉత్తమము. ఏ జబ్బుకైనా సరే యోగసనములు చేసి కింద పడుకోవాలి.
-షేక్.బహర్ అలీ
యోగచార్యుడు