న్యూజిలాండ్ లో  జేసిందాకు బ్రహ్మరథం

అక్లాండ్ః న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిందా ఆర్డెర్న్(40)మరోసారి విజయ పతాకాన్ని ఎగుర వేశారు.  న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికలలో ఆమె ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన  కృషి, సమర్ధవంతమైన పాలన ఆమెకు అఖండ విజయాన్ని సాధించి పెట్టాయి. ఇక్క‌డ ఎన్నికలు ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమై 17 వ తేదీతో దిగ్విజయంగా ముగిసాయి.. ఈ సారి 1. 97 మిలియన్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కున్నారు.. ఇంత పెద్ద ఎత్తున గతం లో ఎప్పుడూ ఓట్లు పోల్ కాలేదు.. శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది సాయంకాలం నుంచి ఫలితాలు వెల్లడించడం ప్రారంభించారు.. ఇందులో లేబర్ పార్టీ కి 49 శాతం ఓట్లు నమోదు కాగా 64 సీట్లు దక్కించుకుంది.. ఇక ప్రత్యర్థి నేషనల్ పార్టీ కి 26. 9  శాతం ఓట్లు నమోదు కాగా 35 సీట్లు గెలుచు కున్నది.. దీంతో లెబర్ పార్టీ మరో సారి అధికారం లోకి రానున్నది. తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన దేశ పౌరులకు ప్రధాని జేసిందా కృతజ్ఞతలు తెలిపారు.. ఈ గెలుపుతో వివిధ దేశాధినేతలు ఆమెకు అభినందన వెల్లువలు కురిపిస్తున్నారు.. దీంతో ఓటమిని అంగీకరించిన ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీ నాయకుడు జుడిత్ కాలిన్స్ ఆర్డెర్న్‌ను అభినందించారు.  ప్రపంచం, దేశం కరోనా బారిన పడిన సందర్భం లో ముందుగా మేల్కొని ప్రమాదాన్ని గుర్తించి దేశాన్ని విపత్తు నుంచి బయట పడినందుకు ఫలితంగా రెండవ సారి ప్రజలు ఆమెకు రెండవ సారి అధికారం కట్టబెట్టినట్టు భావించ వచ్చు. 2017 లో జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీకి 46 సీట్లు వచ్చాయి.

విజయం అనంతరం ఆక్లాండ్‌లో ఆమె తన మద్దతుదారులతో మాట్లాడారు. రాబోయే మూడేళ్ళలో తాను చేయవలసిన పని చాలా ఉందని వ్యాఖ్యానించారు. కరోనావైరస్ మహమ్మారితో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం, సామాజిక అసమానతల పరిష్కారం తనముందున్న సవాళ్లని ఆమె పేర్కొన్నారు. గతంకంటే మరింత ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, అయితే కరోనా సంక్షోభం నుంచి చాలా వేగంగా బయటపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు. కోవిడ్-19 కట్టడిలో తమ ప్రభుత్వానికి ప్రజాభిప్రాయ సేకరణలాంటిదంటూ లేబర్ పార్టీ ఘన విజయంపై ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్‌సన్ సంతోషం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.