న‌వీన్ ప‌ట్నాయ‌క్ ఫ‌స్ట్‌.. కెసిఆర్‌కు ఐదో స్థానం..

న్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్‌ప‌ట్నాయ‌క్ మొద‌టిస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలంగాణ సిఎం కెసిఆర్కు ఐదో స్థానం దక్కింది. ఈ జాబితాలో వ‌రుస‌గా నవీన్‌ పట్నాయక్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, యోగి ఆదిత్యనాథ్‌.. వరుసగా నిలిచారు. ఆ త‌ర్వాత స్థానంలో కెసిఆర్‌తో క‌లిసి మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఐదోస్థానం పొందారు. 2021 జనవరి 3 నుంచి 13 వరకు ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్‌సైట్స్‌తో కలిసి మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ నిర్వహించి మూడ్‌ ఆప్‌ ది నేషన్‌ తెలుసుకునే ప్రయత్నం చేశారు. వీరు నిర్వ‌హించిన పోల్ లో ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ 51% ఓటింగ్‌తో ఉత్తమ ర్యాంకులో నిలిచారు. కాగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 41 శాతం మంది ఓటు వేయగా.. 39 శాతం మంది యోగి ఆదిత్యనాథ్‌కు ద‌క్కింది. కాగా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇద్దరికీ 35% మంది ఓట్లు లభించాయి. ఈ సర్వేలో మొత్తం 12,232 మంది పాల్గొన్నట్లు ఇండియా టుడే-కార్వీ ఇన్‌సైట్స్‌ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.