పబ్జీకి బానిసై బాలుడు ఆత్మహత్య..

వికారాబాద్: పబ్జీ గేమ్ ప్రాణాలను హరిస్తోంది. పబ్జీకి బానిసలైనవారిని ఆ గేమ్ ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచుగా చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. పబ్జీ ఆటపై మోజు ఓ బాలుడి ప్రాణం బలి తీసుకుంది. తండ్రి.. ఫోన్‌లో పబ్జీ అడనివ్వలేదనే కోపంతో కుమారుడు ముక్తానంద్ (14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కులకచర్ల మండలం బండేలకచర్లలో ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.