పరివర్తన కొరకు.. సత్ ప్రవర్తన కొరకు

నీవు
అవును నీకు నీవు
ప్రశ్నలు సందించుకోవాలి
ప్రక్షాళన చేసుకోవాలి…

ముల్ల పొదల వలె దుర్మార్గాలు
కలుపు మొక్కల వలె దురాలోచనలు  నీలో
పెరుగుతున్నప్పుడు
నీవు నీకు నీవు
ప్రశ్నలు సందించుకోవాలి
ప్రక్షాళన చేసుకోవాలి…

మానని పుండు వలె స్వార్థం
మానసిక రోగం వలె ఆపేక్ష
నీకు సోకినప్పుడు
నీవు నీకు నీవు
ప్రశ్నలు సందించుకోవాలి
ప్రక్షాళన చేసుకోవాలి…

నీవు ఒక కరోనా వైరస్ వైతే
కనికరం నీలో కరువైతే
మనిషివన్న విషయం మరిచిపోతే
పీడించడం పీక్కతినడం అలవడితే
కరోనా రక్కసి ఈ రోజు కాకపోతే రేపైనా
అంతం అయ్యే కథనే
నీ కథ కూడా అదే అయితే
నీవు నీకు నీవు
ప్రశ్నలు సందించుకోవాలి
ప్రక్షాళన చేసుకోవాలి…

పరివర్తన కొరకు
సత్ ప్రవర్తన కొరకు

-అడ్డిచర్ల సాగర్
ఉపాధ్యాయుడు
9346474070
(కరోనా వ్యాధిగ్రస్తులను పట్టి పీడిస్తున్న వారు మారాలని, వారిలో మార్పు రావాలని ఆశిస్తూ…)

Leave A Reply

Your email address will not be published.