పరీక్ష రాసేందుకు వెళ్తూ ఇద్దరు మృతి

హైదరాబాద్ : పరీక్ష రాయడానికి వెళ్లున్న ఇద్దరు విద్యార్థులు హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఓ లారీ డ్రైవర్ అతి వేగంగా వాహనం నడపడంతో ఇద్దరి ప్రాణాలు కోల్పోయారు. వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. వివరాల్లోకెళ్తే..ఆదివారం ఉదయం జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్ హైదరాబాద్‌లో డైట్‌సెట్ పరీక్ష రాసేందుకు పరీక్ష కేంద్రానికి బైక్‌పై వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్ అక్కడిక్కడికే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే వీరిద్దరు మృత్యువాత పడినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను మియాపూర్ పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా ఈ విషయం తెలిసిన వారి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.