పాక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 30 మంది మృతి

ఇస్లామాబాద్ (CLiC2NEWS): పాకిస్థాన్‌లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న రెండు రైళ్లు ఢీ కొన్న ప్రమాదంలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. రెతి – దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్లట్ ఎక్స్‌ప్రెస్, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. అయితే, పట్టాలు తప్పిన సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ రైలును.. మిల్లట్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనలో 30 మంది మృతి చెందారని సింధ్ ప్రావిన్స్‌లోని ఘోట్కి జిల్లాలో పోలీసు అధికారి ఉస్మాన్ అబ్దుల్లా చెప్పారు. ఈప్రమాదంలో 13 నుంచి 14 బోగీలు పట్టాలు తప్పాయని తెలిపారు. దాదాపు 9 బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యయి. బోగీల మధ్య చిక్కుకున్న వారిని రక్షించేందుకు సమయంపడుతోందన్నారు. గాయపడ్డ వారిని దవాఖానాలకు తరలించారు. సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.