పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు కరోనా
ఇస్లామాబాద్: పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారని పిఎం ప్రత్యేక సహాయకారిగా ఉన్న ఫైజల్ సుల్తాన్ ట్వీట్ చేశారు. మరోవైపు పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం చైనా టీకా సినోఫాం మొదటి డోసును స్వీకరించడం గమనార్హం. ఇప్పటి వరకు పాకిస్థాన్‌లో కరోనా కేసుల సంఖ్య 6.51 లక్షలకు చేరింది. మరణాలు సుమారు 13,700లకు పైగా చేరినట్టు తెలుస్తోంది.