పాతబస్తీలో సిలిండర్ పేలి 13 మందికి గాయాలు
హైదరాబాద్: పాతబస్తీలోని మీర్‌చౌక్‌లో ఓ ఇంట్లో గురువారం తెల్లవారుజామున సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫతుల్లాబేగ్‌లైన్‌లోని ఓ స్వర్ణకారుడి ఇంట్లో జరిగిన ఈ ప్రమాదంలో బాధితులంతా ఒకే ఇంట్లో ఉండటంతో అందరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరంతా బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడ స్వర్ణకారులుగా పని చేస్తున్నారు. క్షతగాత్రులను ఉస్మానియా దవాఖానకు తరలించారు. బంగారు వస్తువుల తయారీకి వాడే రసాయనాల వల్ల ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.