పాత చట్టాలతో నవశకాన్ని నిర్మించలేం: ప‌్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి కోసం సంస్కరణలు చేపట్టడం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓ వైపు ఢిల్లీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేస్తున్న క్రమంలో.. మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ‘ఆగ్రా మెట్రో రాయ్ ప్రాజెక్ట్’ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
‘‘ దేశంలో అభివృద్ధి చెందాలంటే సంస్కరణలు అత్యావశ్యకం. నూతన సౌకర్యాలు కల్పించాలన్నా, నూతన నిర్ణయాలు తీసుకోవాలన్నా… సంస్కరణలు కచ్చితం. గత శతాబ్దపు చట్టాలతో నూతన శతాబ్దాన్ని నిర్మించలేం. అందుకే మా ప్రభుత్వం పూర్తిగా సంస్కరణలను ప్రోత్సహిస్తోంది’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
అదే విధంగా దేశంలో రూ. 100 లక్షల కోట్లతో దేశంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు చేపట్టనున్నట్లు మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు సర్కార్ మొదలెట్టినట్లు మోదీ పేర్కొన్నారు.