పామర్రు పవన్ పర్యటనలో అపశృతి

కృష్ణా : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి తలెత్తింది. నేడు ఆయన కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉయ్యూరులో తుపానుతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. బుధవారం కనుమూరు పెట్రోలు బంక్ వద్ద కొనసాగుతోన్న ర్యాలీలో.. ప్రమాదవశాత్తూ రెండు కార్ల మధ్య బైక్ ఇరుక్కుంది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరిని మచిలీపట్నం ఆసుపత్రికి, మరో ఇద్దరిని విజయవాడ కామినేని ఆసుపత్రికి తరలించారు.