పిఆర్‌సి రిపోర్ట్ లో ప్రకటించిన ఫిట్మెంట్ అశాస్త్రీయం: పిఎంటిఎ రాష్ట్రశాఖ‌

ఈరోజు విడుద‌ల చేసిన పి.ఆర్.సి రిపోర్టు పూర్తిగా అసంబద్ధంగా, జీవన ప్రమాణాలకు ఏమాత్రం పోలిక కూడా సరిపోనివిధంగా రూపొందించడం జరిగింద‌ని PMTA-TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఈమేర‌కు రాష్ట్ర శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విడివడిన ఆంధ్రప్రదేశ్లో 27 శాతం ఐఆర్ తీసుకుంటుండగా ఆ రాష్ట్రం లో జీవన ప్రమాణాలు ఈ రాష్ట్రం కన్న తక్కువగా ఉన్నాయనే అర్థమా…..? నేటికి క‌నీసం ఒక్క శాతం ఐఆర్ ఇవ్వ‌ని మన రాష్ట్రంలో ఫిట్మెంట్ 7.5 శాతంగా ప్రకటించడం హాస్యాస్పదం అని అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా జీవనప్రమాణాలు పూర్తిగా పడిపోయిన ఈ సందర్భంలో ధరలు ఆకాశాన్ని అంటిన ఈ నేప‌థ్యంలో.. ఈ ఐదు సంవత్సరాల జీవన ప్రమాణ పెరుగుద‌ల‌ 7.5 % ఉన్నట్లుగా సూచించడం కమిషన్ ప్రామాణిక‌త‌ను ప్ర‌తిబింబిస్తున్న‌దని ఆరోపించారు. కాగా వాస్తవాలకు దూరంగా ఉన్న ఈPRC రిపోర్టును PMTA-TS రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ఇక హెచ్ ఆర్ ఏ విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే ఏకైక డిపార్ట్మెంట్ విద్యాశాఖ ఉద్యోగులే. అలాంటి ఉపాధ్యాయులను లక్ష్యంగా చేసుకొని ఒక శాతం హెచ్ ఆర్ ఏ ను తగ్గించడం ఉపాధ్యాయుల పై కక్ష సాధింపే అని ఆరోపించారు. గత కొంతకాలంగా సిపిఎస్ రద్దు పై ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర పోరాటం చేస్తుంటే ఇంకా 4% సి పి యస్ ప్రీమియంను పెంచడం మరి దారుణం అని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం 45 శాతం కు తగ్గకుండా ఫిట్మెంట్ ప్రకటించాలని ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.